ప్రజా రక్షకులకు భద్రత ఉందా?

దేశంలోనే మొత్తం చేసిన పనికి ఏ మాత్రం విలువలేని ఉద్యోగులెవరున్నా ఉన్నారా అంటే అది ఒక్క పోలీసు ఉద్యోగులే. ఔను! దేశ సరిహద్దుల్లో ఆహోరాత్రులు కాపలా కాస్తూ మనకు రక్షణ కల్పించేది సైనికులైతే.. సమాజంలో అడుగడుగునా మనకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడే పోలీసుల కష్టానికి సరిపడా జీతాల మాట దేవుడెరుగు, కనీసం గుర్తింపు కూడా తక్కువే. పొట్టకూటి కోసం పోలీసు ఉద్యోగంలో చేరిన పాపానికి సొంత ఇంటి కష్టసుఖాలను దేవుడికి వదిలేసి ప్రజలు శాంతియుతంగా జీవించడానికి పాటుపడే పోలీసులు బయటకు కనిపించని దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఈ శాంతియజ్ఞంతో తమ ప్రాణాలను ధారపోస్తున్నారు. పోలీసు లేనిదే ఒక్క గంట ? గడపలేని రాజకీయ నాయకులు తాము అధికారంలో ఉన్నప్పుడయినా పోలీసుల సమస్యలపై దృష్టి సారించకపోవడం దారుణం. రాజకీయ నాయకులే కాదు పోలీసుల పుణ్యమా అని ఇళ్ళల్లో గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోగలిగే కోట్లాది మంది ప్రజలు తరచుగా పోలీసులనే ఆడిపోసుకోవడం విషాదం. పూర్వపు రోజుల్లో కాశీకి వెళ్ళితే కాటికి వెళ్ళినట్లే అనే వారు. కానీ ఇప్పుడు పోలీసు ఉద్యోగి ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తే తిరిగి ??????ి క్షేమంగా వస్తాడన్న గ్యారంటీ ఉండదు. అంతా ప్రశాతంగా ఉందనుకుంటేనే పన్నెండు నుంచి పదిహేను గంటలు పనిచేసే పోలీసులు ఇక ఏపాటి గందరగోళాలు నెలకొన్నా ఆహోరాత్రులు డ్యూటీలో ఉండాల్సిందే.

తీరని మారని పాలక వ్యవస్థ…
బ్రిటీష్ పాలకులు మన దేశం వదిలి వెళ్ళకముందు ఉన్న పోలీసు మాన్యువల్ మనం ఇప్పటి వరకు అమలుచేసుకుంటున్నాం. మన దేశాన్ని వందలు సంవత్సరాల పాటు దోచుకుపోయిన తెల్లవాడి నిబంధనలను ఇప్పటికీ మనం తూచ తప్పకుండా పాటించేస్తున్నాం. కాలానుగుణంగా పోలీసులు స్థితిగతుల్లో కాని,వారి జీవన స్థితిగతుల మెరుగుదలకు ప్రభుత్వాలు అవసరమైనంత మేరకు స్పందించలేదనే చెప్పాలి. ఏ ప్రభుత్వ డిపార్ట్‌మె్ంలలోను లేని క్రమశిక్షణ పోలీసు శాఖలోనే ఉంటుంది. తమ సమస్యలపై గొంతెత్తడానికి లేదు. జీతాలు పెంచండి మహాప్రభో అంటూ అడగడానికి లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇతర అలవెన్స్‌లు ఇమ్మని విజ్ఞప్తి చేయడానికి లేదు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తాను జీతాల గురించి, డిమాండ్ల పరిష్కారం గురించి, ఏడాదికో రెండేళ్ళకో ఒకసారి సమ్మె నోటీసులు ఇవ్వడం మనము చూస్తూ ఉన్నాం. వాళ్ళు అలా నోటీసులు ఇవ్వగానే ప్రభుత్వం చర్చలకు పిలిచి ఎన్నో కొన్ని డిమాండ్లను పరిస్కరించడం మనకు తెలుసు. కానీ దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు పోలీసులు సమ్మె చేసిన పాపాన పోలేదు. ఎందుకంటే ఈ క్రమశిక్షణ పోలీసుల పాలిట శిక్షగానే పరిణమిస్తోంది. జీతాలు.. భత్యాలే కాదు సెలవుల విషయంలోనూ పోలీసుల పరిస్థితి దారుణమే. వాళ్ళకి పండగలు ఉండవు, పబ్బాలుండవు చాలా సందర్భాలలో వీక్లీ ఆఫ్‌లు ఉండవు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తమ కుటుంబాలతో విలాసాలకు, వినోదయాత్రలకు, వెళ్తూ ఉంటారు. కానీ పోలీసులకు అంది అందని ద్రాక్షే. పండుగ రోజు ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లవ్‌ు వచ్చిన ఇంటిని వదిలి డ్యూటీలో చేరాల్సిందే.

నక్సలిజం…
మన రాష్ర్ట విషయానికి వస్తే 1969 నుంచి రెండేళ్ళ క్రితం వరకు నక్సలిజం సమస్య చాలా ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో అటు ప్రజాప్రతినిధులను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమరులైన పోలీసులకు కొదవేలేదు. ఇంత త్యాగం చేస్తే ఏడాదికోసారి అమర పోలీసు జవానులకు సంస్మరణ దినం పేరిట ఒకసారి గుర్తుకు తెచ్చుకోవటం తప్ప ఆ త్యాగధనులకు ప్రభుత్వం చేసిందేమి ఉండదు. ఇక ఇతర సంఘ విద్రోహక శక్తులకు రాజకీయ నాయకుల అండదండలుండడంతో పోలీసులు పడ్డ శ్రమ కాస్తా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ జాడ్యం అన్ని రాజకీయ పార్టీలలోని ఉంది. అలాగని రాజకీయనాయకులంతా అలాగే ఉంటారని కాదు. నిజాయితీగా ఉండే రాజకీయ నేతలు ఉన్నారు. కాకపోతే గంజాయి వనంలో తులసి మొక్కల్లా వారి సంఖ్య చాలా తక్కువ ప్రజా ప్రతినిధులకు సెక్యూరిటీ పేరిట వారి ఊరేగింపులకురక్షణ పేరిట ఉదయం లేచిన దగ్గర నుంచి రాజకీయ నాయకులకు, ఇతర వి.ఐ.పి.లకు పోలీసులు లేనిదే క్షణం ముందుకు పోలేరు. రాజకీయ జోక్యాలు లేకపోతే ఏ కేసునైనా సరే క్షణాల్లో తేల్చిపారేయడంలో మన పోలీసులు స్కాట్‌ల్యాండ్ పోలీసులకు ఏ మాత్రం తీసిపోరని చెప్పడం అతిశయోక్తి కాబోదు. దేశ పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్న పోలీసులు మరెవరో కాదు కనిపించని నాలుగో సింహమే పోలీసు. ఓ వ్యాస్, ఓ ఉమేస్ చంద్ర లెక్కకు మించిన పోలీసు అమరవీరులకు లోటేలేదు. లా అండ్ ఆర్డర్‌ని ఇంత సమర్దవంతంగా కాపాడుకుంటూ పోలీసు ఉద్యోగుల సంక్షేమం గురించి ఒక క్షణం ఆలోచించినా, వాళ్ళకు జరుగుతున్న నష్టం అర్థమవుతుంది.

విశృంఖలంగా పెరిగిపోయిన మీడియా?
విశృంఖంగా పెరిగిపోయిన మీడియా కూడా పోలీసులను మనస్ఫూర్తిగా డ్యూటీ చేసుకోనివ్వ నంటోంది. కానిస్టేబుల్ నుంచి డి.జి.పి దాకా అన్ని స్థాయిల్లో ఖాకీదారుడు అనవసర విషయాల్లో పట్టుబడుతున్న దాఖలాలు కోకొల్లలు. ఇటీవల చేసిన చిన్నపాటి కామెం??????ి.. చిలువలు పలువలుగా మారి, నానారాద్ధాంతం సృష్టించింది. అత్యాచారాలకు దారితేసే కారణాల్లో అమ్మాయిల వస్త్రదారణ కూడా ఒకటన్న మాజీ డిజిపి వ్యాఖ్యాల్లో తప్పేమి లేదని సర్వత్రా తెలుసు. అయితే… మాజీ డిజిపిని ఏకాకిని చేసి, మహిళా సంఘాలను వెనకేసుకొచ్చి, ప్రజల్లో పోలీసుల పట్ల వ్యతిరేకతను పెంచడానికి కొన్ని మాధ్యమాలు కంకణం కట్టుకోవడం శోచనీయం. పోలీసు అధికారుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడ్డం, రచ్చ చేయడం, బజారుకీడ్చడం ఇవన్నీ కొన్ని మీడియా సంస్థల దూకుడులో భాగాలైపోయాయి. ఇందువలన ముందునుయ్యి వెనుక గొయ్యి తవ్విపెట్టి పోలీసును కదలనివ్వకుండా చేస్తుంది. ప్రస్తుత సమాజ పోకడలో ప్రేమోన్మాదులు రెచ్చిపోయిన సందర్భాలలో వారి రాక్షసత్వాన్ని చూసి ప్రజలందరూ చలించిపోతారు. పట్టిస్తే.. కొట్టి చంపేస్తామంటూ రెచ్చిపోతారు కానీ, అరెస్టులు, దర్యాప్తులు, కోర్టులు, విచారణలు, శిక్షణ అంటూ భవిష్యత్తులో శ్రమ తగ్గించడం కోసం.. భూమికి భారమనుకున్న ఉన్మాదుల్ని ఎన్‌కౌంటర్ చేస్తే, ఆహ పోలీసుల్లో ఎంత గొప్ప సామాజిక సృ్తహ అంటూ.. కొన్ని గొంతులు వెల్డన్ చెబితే మరి కోర్టులెందుకు, శిక్షలెందుకు? అంటూ వేలాది డౌన్ డౌన్ నినాదాలు వినిపిస్తాయి. ఏం ఖాకీకి ఆ మాత్రం విచక్షణ అక్కర్లేదా..? అతను మాత్రం.. మనసు పెట్టి ఆలోచించకూడదా? సొగసైన సమాజం కోసం హద్దుమీరితే తప్పెందుకవుతుంది..? ప్రజల్లో ఆలోచన మారాలి. ఈ రకమైన వివేచన పెరగాలి.
పోలీసు వెంకటస్వామి గుండె రగిలిపోతోంది. భుజాల మీద వున్న నక్షత్రాలు వాణ్ణి చూసి వెకిలిగా నవ్వుతున్నాయి. డ్యూటీ తీసుకున్న తొలిరోజు ప్రమాణ పత్రం గుర్తుకొచ్చి.. వాడి కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూస్తోంది. వెక్కిరిస్తున్న విధి నిర్వాహణ అతగాడి ముందరికాళ్ళకు బేడీలేస్తుంది. ఏయ్ టూనాట్ ఫోర్ ఏం చేస్తున్నావక్కడ. ఒక అదిలింపుతో పోలీసు ఈ లోకంలోకొచ్చాడు. ఏమిటీ తన బ్యూటీ ఎందుకీ భుజకీర్తులు..? ఉలిక్కిపడ్డాడు. అవును.. సగటు పోలీసు ఇప్పుడా విధి వంచితుడు. ??????దారుడు తన కేస్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చూసుకునే సదుపాయం వచ్చింది. నేషనల్ క్రైం బ్యూరో రికార్డులు, నేరాల మోతాదుల్ని తీరు తెన్నుల్ని ఎప్పటికప్పుడు అందరికి పంచిపెడుతుంది. ప్రతీది సైబరీకరణ జరిగి ఏది కావాలన్నా సులభంగా క్షణాల్లో దొరికిపోతుంది. ఇదే మోతాదులో నేరగాళ్ళ తెలివితేటు కూడా మితిమీరిపోచాయి. మన హైదరాబాద్ విదేశీ నేరాల అడ్డాగా మారిపోయిందని డ్రగ్స్ నుంచి హత్యల దాకా నేరన్రనంచానికంత మన నడిడ్డే గరిమనాభిగ మారిపోయిందని చాలా దుష్పరిణామాలు లెక్కలేసి చెప్తున్నాయి. కానీ.. ఇన్ని మాఫియాలను నియంత్రిం చాల్సిన పోలీసు చేతుల్లో మాత్రం.. విష్ణుచక్రాల్లేవు. తప్పు పట్టిన నాటిన నాట్‌నాట్ సెంచరీ నాటి రైఫిళ్ళు తప్ప వామపక్ష తీవ్రవాద నిర్మూలనలో సెబాష్‌లు కొట్టించుకున్న తెలుగు ఖాకీల దగ్గర. ఏ టార్గెట్లిచ్చినా విరోచితంగా పోరాడే ప్రతిభ వుంది. కానీ. ఆ పోరుకు తగిన వాతావరణం భుజం తట్టి ముందుకు నడిపించే ప్రోత్సాహమే సర్కారు దగ్గర లేదు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*