Realhero.in http://www.realhero.in Realhero magazine, Real Hero magazine Telugu, Realhero Police Magazine, Telugu Realhero Magazine, Telugu Real Hero News, Real Hero Crime News. Fri, 09 Feb 2018 08:44:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=4.9.9 C V Anand http://www.realhero.in/c-v-anand/ http://www.realhero.in/c-v-anand/#respond Mon, 29 Jan 2018 11:05:23 +0000 http://www.realhero.in/?p=790 The post C V Anand appeared first on Realhero.in.

]]>

The post C V Anand appeared first on Realhero.in.

]]>
http://www.realhero.in/c-v-anand/feed/ 0
క్రికెట్…పోలీస్..అండ్ ఆనంద్ http://www.realhero.in/%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%86%e0%b0%a8%e0%b0%82/ http://www.realhero.in/%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%86%e0%b0%a8%e0%b0%82/#respond Mon, 29 Jan 2018 11:01:11 +0000 http://www.realhero.in/?p=769 కలలు అందరూ కంటారు. కానీ కొందరే వాటిని నిజం చేసుకుంటారు. ఎక్కువ మంది తమ బంగారు భవిష్యత్ కోసం కలలు కంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రం చుట్టూరా ఉన్న సమాజం బాగుండాలని కలలు కంటారు. ఆ కలలను నిజం చేయడానికి తమవంతు పాత్రను నిజాయితీగా పోషిస్తారు.అటువంటి అరుదైన ధీశాలుల్లో ఐపీఎస్ ఆఫీసర్ సి.వి.ఆనంద్ ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు సి.వి.ఆనంద్. నిబద్ధతగల పోలీసు అధికారిగా సి.వి.ఆనంద్ గురించి అందరికీ తెలుసు. ...

The post క్రికెట్…పోలీస్..అండ్ ఆనంద్ appeared first on Realhero.in.

]]>
కలలు అందరూ కంటారు.
కానీ కొందరే వాటిని నిజం చేసుకుంటారు.
ఎక్కువ మంది తమ బంగారు భవిష్యత్ కోసం కలలు కంటారు.
కానీ చాలా కొద్ది మంది మాత్రం చుట్టూరా ఉన్న సమాజం బాగుండాలని కలలు కంటారు.
ఆ కలలను నిజం చేయడానికి తమవంతు పాత్రను నిజాయితీగా పోషిస్తారు.అటువంటి అరుదైన ధీశాలుల్లో ఐపీఎస్ ఆఫీసర్ సి.వి.ఆనంద్ ఒకరు.

తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు సి.వి.ఆనంద్.
నిబద్ధతగల పోలీసు అధికారిగా సి.వి.ఆనంద్ గురించి అందరికీ తెలుసు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి…మృత్యువుకు అత్యంత దగ్గరగా వెళ్లి బయట పడ్డ యోధుడిగా ఆనంద్ ను ఒక యోధుడిగానే భావిస్తారు పోలీసు విభాగంలో.
పోలీసు శాఖలో మనకి చాలా మంది యోధులైన అధికారులు ఉన్నారు.
పోలీసు విభాగంలో రక రకాల సంస్కరణలు తెచ్చిన అధికారులు ఉన్నారు.
ఎంతటి పెద్ద రాజకీయ నాయకుడు ఆదేశించినా రూల్స్ కి విరుద్ధంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోని అధికారులూ అక్కడక్కడ..అప్పుడప్పుడూ మెరుస్తూనే ఉన్నారు.
వినూత్న ఆలోచనలతో పోలీసు విభాగాన్ని పరుగులు పెట్టించిన వారూ ఉన్నారు.
మరి ఆనంద్ స్పెషాలిటీ ఏమిటి?

పైన మనం చెప్పుకున్న అరడజనుకు పైగా లక్షణాలన్నీ ఒక్క ఆనంద్ లోనే ఉన్నాయి.
విధి నిర్వహణలో రాజీపడ్డం అంటే ఏంటో కూడా తెలీకుండానే ఆయన పని చేస్తూ వస్తున్నారు.
తన పరిధిలో ఎన్నో సంస్కరణలకు రూపకల్పన చేసి ..పై అధికారుల చేత ఒప్పించి ..వారిని మెప్పించి..ఆ సంస్కరణలను పోలీసు విభాగమంతా విస్తరించేలా చేసిన విజనరీ ఆనంద్ .
కనీసం నాలుగు సార్లు నక్సలైట్ల దాడల నుంచి ప్రాణాలతో బయట పడ్డ చిరంజీవి.
అయినా ప్రాణాలకు లెక్కచేయకుండా డ్యూటీ చేయడాన్ని తన కర్తవ్యంగా భావించే అరుదైన అధికారి ఆనంద్.
అన్నింటికీ మించి.
ఆనంద్ ఎన్నడూ బాస్ లా వ్యవహరించలేదని ఆయనతో పని చేసిన పోలీసు సిబ్బందే చెబుతారు.
ఆయన బాస్ కాదు. మంచి లీడర్.
బాస్ అంటే కంటి చూపుతో కింది సిబ్బంది చేత అన్ని పనులు చేయించేవాడు.
అదే లీడర్ అయితే..తాను ముందుండీ పనులు చేస్తూ ..సహచరులచేత చేయిస్తూ వారికి ఆదర్శంగా ఉంటూ..స్ఫూర్తిని రగిలిస్తూ ముందుకు సాగేవాడు.
ఆనంద్ దృష్టిలో హోం గార్డు నుంచి తన స్థాయి వరకు తనతో పని చేసే ప్రతీ పోలీసూ తన సహచరుడే. తనకంటే చిన్న స్థాయి ఉద్యోగులను చిన్న చూపు చూడ్డం..పై అధికారులను మెప్పించడానికి ప్రయత్నించడం రెండూ చేయలేదు ఆనంద్.
ఆయన పోలీసు విభాగంలో సాధించిన అద్భుత విజయాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆయన ప్రస్థానం ఎలా సాగిందో ఓ సారి తెలుసుకోవడం అవసరం.

హైదరాబాద్ లో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆనంద్ బాల్యం చాలా మంది పిల్లల్లాగే సాగింది.
ఆటలంటే ప్రాణం.
విపరీతంగా ఆడేవారు.
అలాగని చదువుకు దూరం కాదు.
చదువంటే మితిమీరిన ఇష్టం.
ఆటకీ..చదువుకీ మధ్య అనితర సాధ్యమైన సమన్వయాన్ని ముక్కుపచ్చలారని ప్రాయంలోనే అలవాటుగా మార్చుకున్నారు ఆనంద్.
సైఫాబాద్ లోని విద్యారణ్య హై స్కూల్ లో చదివారు ఆనంద్.
ఇంటర్మీడియట్ చదివే సమయంలో క్రికెట్ పై మనసు పారేసుకున్నారు.
అంతకు ముందు నుంచే క్రికెట్ లో ఆల్ రౌండర్ గా ఎదిగిన ఆనంద్ ఇంటర్ నుంచి రక రకాల టోర్నీల్లో మెరుస్తూ వచ్చారు. కీలక ఇన్నింగ్స్ తో తన జట్టును గెలిపిస్తూ వచ్చారు.
నిజాం కాలేజీలో కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు.
నిజాం కాలేజీలో చదివేటప్పుడే .ఇంటర్ యూనివర్శిటీ టోర్నీల్లో అదరగొట్టారు.
ఆ తరుణంలో భారత్ అండర్ -19 జట్టు ఇంగ్లాండ్ పర్యటించింది.
ఆ జట్టులో ఆనంద్ కూడా సభ్యుడు.
ఆ సమయంలోనే.. ఫుల్ టైమ్ క్రికెటర్ గా సెటిల్ అవ్వాలని ఆనంద్ ఆకాంక్షించేవారు.
చేతిలో ఆట ఉంది. ప్రతిభకు కొదవ లేదు. కానీ ..క్రికెటర్ గానే ఎదగాలంటే..తట్టుకుని నిలబడ్డానికి అవసరమైన ఆర్ధిక స్థోమత మాత్రం ఆనంద్ తల్లిదండ్రులకు లేదు.
క్రికెటర్ గా సెటిల్ అవ్వాలంటే జాతీయ జట్టులో అవకాశం వచ్చేవరకు పడిగాపులు పడాలి.
ఎంతటి ప్రతిభ ఉన్నా జట్టులో స్థానం దక్కాలంటే మాటలు కాదు. ఏళ్ల తరబడి నిరీక్షించాలి. అంతవరకూ ఎక్కడో ఒక చోట ఆడుతూనే ఉండాలి. ఇదంతా బాగా డబ్బున్న వాళ్ల కే సాధ్యమవుతుంది.ఇది డబ్బున్న వాళ్ల ఆట. తన లాంటి మధ్య తరగతి మనుషులకు క్రికెట్ కోసమే నిరీక్షించడం కష్టమని అనుకోగానే… మనసులో కొంత నిరాశ చెందారు ఆనంద్. కానీ చాలా వేగంగా ఆ నిరాశ నుంచి బయట పడ్డారు. కర్తవ్యం ఏంటా అని ఆలోచించారు.
అలా ఆలోచిస్తోన్న తరుణంలోనే ఆయన జీవితాన్ని ఓ మలుపు తిప్పింది ఓ ఐడియా.
నిజంగానే ఆయన జీవితాన్ని మార్చేసిన ఐడయా అది.
కాకపోతే ఆ ఐడియా ఆయన మెదడులో పుట్టింది కాదు.
ఆయన మనసులో స్థానం సొంతం చేసుకున్న ఓ మహిళామూర్తి మెదడులోంచి ఆ ఐడియా బయటకు వచ్చింది. సివిల్ సర్వీసెస్ ను లక్ష్యంగా చేసుకుంటే ఎక్కవ మంది ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని ఆయన స్నేహితురాలు చెప్పడంతో… ఆయనకూ అదే కరెక్ట్ అనిపించడంతో మరో ఆలోచన లేకుండా సివిల్స్ కు ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
ప్రాక్టీస్ ఉన్నా లేకున్నా సెంచరీలు చేసే క్రికెటర్ ఆయన. ఇక ప్రాక్టీస్ కూడా తోడైతే చెప్పేదేముంది. సివిల్స్ లో మొదటి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయ్యారు. అది కూడా 77 వ ర్యాంకుతో సగర్వంగా. 1992 లో ఐపీఎస్ పోస్టింగ్. అపుడు ఆయన వయసు కేవలం 22 ఏళ్లు. అంటే తన ఈడు కుర్రాళ్లు ఇంకా జీవితాన్ని ఎంజాయ్ చేసే మూడ్ లో ఉండే వయసది.పోలీసు శాఖలో అడుగు పెట్టాక చుట్టూరా ఉన్న సమాజం ఇంకా బాగా అర్ధమవ్వడం మొదలైంది.
అందరూ ప్రశాంతంగా జీవించాలంటే…కొందరు అహోరాత్రులూ శ్రమించాలని అర్ధమైంది.ఆ కొందరిలో తానూ ఉన్నానని తెలుసు. ఆ సవాల్ ను చాలా ఇష్టంగా స్వీకరించారు. చాలా మంది కోసం తన లాంటి కొందరు పోలీసులు తమ సుఖాలను త్యాగం చేయడం ఉదాత్తమైన డ్యూటీ అని అనిపించింది.ఎక్కువ మంది కళ్లల్లో ఆనందాన్ని చూడ్డం కోసం..తమ కళ్లల్లో ఆనందాన్ని త్యాగం చేయడం కూడా సంతోషమే అనుకున్నారు.
తన లాగే చాలా మంది పోలీసులు అదే పని చేస్తున్నారని తెలుసు. అందుకే పోలీసునని చెప్పుకోడానికి చాలా గర్వపడతారాయన.

మనతో పని చేసేవాళ్లు మనల్ని గౌరవించాలంటే ఏం చేయాలి…?
వారితో కలిసిపోయి..మనం పని చేస్తూ వాళ్ల చేత చేయిస్తూ..అంతా ఓ టీమ్ వర్క్ లా.. ఓ మంచి ఆటలా చేయాలి. అలా ఆడుతూ పాడుతూ ఏ పని చేసినా అలసట తెలీదు. ఆనందం తప్ప ఏమీ మిగలదు.
నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాహసోపేతంగా విధులు నిర్వహించారు.ఆ సమయంలోనే కనీసం నాలుగు సార్లు నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంచి తృటిలో తప్పించుకున్నారు.

పోలీస్ స్టేషన్ కు ఏదో ఒక సమస్యతో వచ్చే పౌరులను సాదరంగా ఆహ్వానించి వారి కష్టాలను పోగొడితే..ఆ పౌరులు ఎంత ఆనందిస్తారో ఆయన చూశారు. అలా ఎక్కువ మంది ఆనందిస్తోంటే..ఆనంద్ కి సంతృప్తిగా ఉండేది.
రాజకీయ పలుకుబడితోనో….సంపన్న వర్గాలమన్న ధీమాతోనో తన దగ్గరకు వచ్చి పనులు పురమాయించే వాళ్లని అల్లంత దూరంలోనే పెట్టేయడం ఆనంద్ కు అలవాటు.
ఫిర్యాదుచేయడానికి వచ్చిన వ్యక్తి దగ్గర న్యాయం ఉందని పిస్తే..ప్రపంచం తల్లకిందులైనా సరే వారిని కాపాడ్డానికి వెనుకాడరు ఆనంద్.అదే వచ్చిన వారే దోషులని తెలిస్తే..ఎంతటి పెద్ద నాయకుడు రికమెండ్ చేసినా ఆనంద్ ఆ పని చేసేవారు కాదు.రాజీ పడకుండా అలా విధులు నిర్వహించడానికే ప్రభుత్వం తనకు జీతం ఇస్తోందని నమ్ముతారాయన.జీతం తప్ప ఇంకే రకమైన డబ్బులతోనూ తనకు అవసరం కానీ..పని కానీ లేదని భావిస్తారు ఆయన.

పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు ఆనంద్.
రక రకాల విభాగాల్లో పని చేశారు. ఎక్కడ చేసినా తనదంటూ ఓ ముద్ర వేసి మరీ వస్తారు.
అదే సి.వి. మార్కు.
ట్రాఫిక్ విభాగంలో ఉన్నప్పుడే ఎండనక..వాననక..మంచనక..చలి అనక…రాత్రీ పగలూ తేడా లేకుండా నడి రోడ్డుపై నిలబడి విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల సంక్షేమం కోసం రక రకాల సదుపాయాలు కల్పించిన మొదటి అధికారి బహుశా ఆనందే.
ఇక ఆనంద్ అనగానే హైదరాబాద్ జంటనగరాలకు గుర్తుకొచ్చేది డ్రంకెన్ డ్రైవ్.
తప్ప తాగి..ఆ మత్తులో డ్రైవింగ్ చేసి..తమ ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టేవారికి చెక్ చెప్పడానికి ఆనంద్ డ్రంకెన్ డ్రైవ్ మొదలు పెట్టారు.
ఎంతటి పదవిలో ఉన్న వారైనా సరే..
ఎంతటి ప్రముఖులైనా సరే..
తాగి డ్రైవింగ్ చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పేశారు ఆనంద్.
చెప్పి ఊరుకోలేదు. దాన్ని కచ్చితంగా అమలు చేశారు.
తాగి డ్రైవ్ చేసినా..పోలీసులు పట్టుకుంటే యాభయ్యో..వందో ఇచ్చి తప్పించుకోవచ్చులేననే పొగరుబోతులకు షాక్ ట్రీట్ మెంటే ఇచ్చారు ఆనంద్.
సెలబ్రిటీలు..సినీ స్టార్లు..రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు…కార్పొరేట్ దిగ్గజాలు..
ఎవరినీ వదల్లేదు. తాగి డ్రైవ్ చేస్తే కేసు నమోదు చేసేయడమే.
అక్కడి నుంచి కోర్టుకు తరలించడమే. ఈ డ్రైవ్ సక్సెస్ కావడంతో పాటే..రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.ఇదంతా ఆనంద్ ఆలోచన ఫలితమే నని పోలీసు సిబ్బందే గర్వంగా చెబుతారు.
ప్రమోషన్లకోసం..కావల్సిన చోట్లకు బదలీల కోసం..ఆనంద్ ఎన్నడూ వెంపర్లాడలేదు.
ఏ పోస్ట్ ఇస్తే అది చేశారు. ఎక్కడికి బదలీ చేస్తే అక్కడికి పోయి ఆనందంగా ఉద్యోగం చేశారు. అలా ఉద్యోగం చేస్తూనే తనదంటూ ఓ ముద్రను బలంగా వేశారు. 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ లో ఉన్న ఆనంద్..తెలంగాణ రాష్ట్ర అవతరణతో తెలంగాణ క్యాడర్ కు అలాట్ అయ్యారు.
ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు.
చైన్ స్నాచర్ల ఆట కట్టించే పనిలో ఆనంద్ బిజీగా ఉన్నారు.

 
క్రికెట్టే అన్నీ నేర్పింది
 
ఆనంద్ తాను కలగన్నట్లు క్రికెటర్ గా సెటిల్ అయి ఉండి ఉంటే…భారత క్రికెట్ జట్టు తరపున ఎన్నో రికార్డులు సృష్టించి ఉండేవారు. ఎన్నో మ్యాచుల్లో భారత్ ను గెలిపించి ఉండేవారు. అంతర్జాతీయ స్థాయిలో ఎందరో అభిమానులను సంపాదించుకుని ఉండేవారు.కానీ ఆ కల నెరవేరలేదు.అది ఆయన దురదృష్టం కావచ్చు.
కానీ అది హైదరాబాద్ వాసుల అదృష్టం కూడా.
ఆయన క్రికెటర్ కాకపోవడం వల్లనే ఓ మంచి పోలీసు అధికారి మనకి దక్కారు.
నిజాయితీగా ..నిర్భయంగా …నిర్మొహమాటంగా ..నిక్కచ్చిగా.. వ్యవహరించే ఐపీఎస్ అధికారి మనకి లభించారు.నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించారు.
క్రికెటర్ గా స్థిరపడకపోయినా..క్రికెట్ ఆట తనకు ఎంతో నేర్పిందని ఆనంద్ అంటూ ఉంటారు.
ఒక టీమ్ లా ఎలా ముందుకు సాగాలో క్రికెట్ నేర్పింది.
బ్యాట్స్ మన్ గా చెడ్డ బంతులను బౌండరీలను తరలించడమెలాగో ఆనంద్ కు తెలుసు.
ఆ చిట్కాతోనే చెడ్డ మనుషులను జైళ్ల లోపలికి పంపడం ఎలాగో కూడా ఆయనకు తెలుసు.
మంచి బాల్ పడే వరకు సహనంగా ఆడాలని క్రికెట్ నేర్పింది.
అలాగే నేరస్థుల వేటలో సాక్ష్యాలు దొరికే వరకు సహనంగా అన్వేషణ చేయడమెలాగో అబ్బింది.
ఇలా క్రికెట్ లో అడుగడుగునా ఆయన నేర్చుకున్న పాఠాలనే పోలీసు జీవితానికి అన్వయించుకుని విజయాలు సాధిస్తున్నారాయన.

ఇన్ని విజయాల తర్వాత బహుశా ఆనంద్ కి కూడా తాను క్రికెటర్ కాకపోవడమే మంచిది అయిందని అనిపించవచ్చు.ఎందుకంటే ఆయన తన ఆనందం గురించి కన్నా సమాజ శ్రేయస్సు గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే క్రికెటర్ ఆనంద్ కన్నా ఐపీఎస్ ఆనందే రియల్ హీరో.

The post క్రికెట్…పోలీస్..అండ్ ఆనంద్ appeared first on Realhero.in.

]]>
http://www.realhero.in/%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%86%e0%b0%a8%e0%b0%82/feed/ 0
రాహుల్.. ఓ సాహసయాత్ర http://www.realhero.in/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%b8%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/ http://www.realhero.in/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%b8%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/#respond Mon, 29 Jan 2018 10:10:45 +0000 http://www.realhero.in/?p=736 రాహుల్ దేవ్ శర్మ, ఐపీఎస్… -త్తరప్రదేశ్‌లోఁ బెజార్ నగరంలో -షో శర్మ దంపతులకఁ జఁ్మంచారు. పోలీస్ ఆఫీసర్ కావాలనే తన చినశీనాటి కలను నెరవేర్చుకఁనేందుకఁ అహరిశీశలు శమ్రించారు. ఆ కలను సాకారం చేసుకఁనేంత వరకఁ విశ్రమించలేదు. ఇప్పుడు విధి ఁర్వహణలో ఁహీరో’చితంగా వఁవహరిస్తూ తనేంటో రుజువు చేసుకఁంటునాశీరు. కాబోయే పోలీసులకఁ దిక్సూచిగా.. సాటి అధికారులకఁ ఆదర్శంగా ఁలుస్తునాశీరు. -త్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకఁ రాహుల్ జరీశీపై దృష్టి పెడితే… యూపీ టూ ఏపీ పోలీసుల ఒడ్డూపొడవుల గురించి ...

The post రాహుల్.. ఓ సాహసయాత్ర appeared first on Realhero.in.

]]>
రాహుల్ దేవ్ శర్మ, ఐపీఎస్… -త్తరప్రదేశ్‌లోఁ బెజార్ నగరంలో -షో శర్మ దంపతులకఁ జఁ్మంచారు. పోలీస్ ఆఫీసర్ కావాలనే తన చినశీనాటి కలను నెరవేర్చుకఁనేందుకఁ అహరిశీశలు శమ్రించారు. ఆ కలను సాకారం చేసుకఁనేంత వరకఁ విశ్రమించలేదు. ఇప్పుడు విధి ఁర్వహణలో ఁహీరో’చితంగా వఁవహరిస్తూ తనేంటో రుజువు చేసుకఁంటునాశీరు. కాబోయే పోలీసులకఁ దిక్సూచిగా.. సాటి అధికారులకఁ ఆదర్శంగా ఁలుస్తునాశీరు. -త్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకఁ రాహుల్ జరీశీపై దృష్టి పెడితే…


యూపీ టూ ఏపీ
పోలీసుల ఒడ్డూపొడవుల గురించి ప్రతేఁకంగా చెప్పాల్సిన పఁలేదు. -దోఁగంలో వారి పఁతీరు, ప్రతిభా పాటవాల గురించి ఆరా తీసినప్పుడే వారిలో అంకితభావం ఎంతుందో అర్థమవుతుంది. చదివింది అలహాబాద్‌లోఁ ఎన్టీపీసీలో సివిల్ ఇంజినీరింగ్. హరాఁనాలోఁ ఝజ్ఞం ఎన్టీపీసీలో ప్లాంట్‌లో ఏడాదినశీర పాటు ఇంజినీర్‌గా పఁచేశారు. రైల్వేసర్వీసులోకి ప్రవేశించి సౌత్ సెంట్రల్ రైల్వే అసిస్టెంట్ ఇంజినీర్‌గా బాధఁతలు ఁర్వర్తించారు. తన నైజాఁకి తగిన -దోఁగం కాదఁ భావించి పోలీస్ సర్వీస్‌పై దృష్టి సారించారు. 2010 డిసెంబర్ 20న తన లక్షాఁఁశీ చేరుకఁనాశీరు. 2012 ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకఁ గ్రేహౌండ్ అసిస్టెంట్ కమాండర్‌గా, 2013 ఏప్రిల్ నుంచి 2015 జూన్ వరకఁ పార్వతీపురం ఏఎస్పీగా, 2015 జూన్ నుంచి 2016 జనవరి వరకఁ కడప ఓఎస్డీగా, 2016 మార్చి నుంచి 2016 మే వరకఁ సీఐడీలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా విధులు ఁర్వర్తించారు. 2016 మే 9న విశాఖపటశీం రూరల్ ఎస్పీగా బాధఁతలు చేపట్టారు.
సమసఁల పరిష్కారమే ధేఁయంగా..
మావోయిస్టు కారఁకలాపాలు, గంజాయి స్మగ్లింగ్, ఇసుక అక్రమ మైఁంగ్ తదితర సమసఁలను ఁయంత్రించడమే ధేఁయంగా పఁచేశారు. 16వ నంబర్ జాతీయ రహదఃరిపై జరిగే పమ్రాదఃలను తగ్గించడం కోసంకూడా కృషి చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన విశాఖ రూరల్‌లో పఁచేయడం కత్తిమీద సాములాంటిదే అయినా తాను ఏరోజు ఁయభ్రాంతులకఁ లోనుకాలేదంటారాయన. మనసులో మలినం లేకపోతే మఁషిఎంత దూరమైనా వెళ్లవచ్చు అనేందుకఁ రాహుల్ దేవ్ శర్మే గొప్ప -దఃహరణ.
మార్పునకఁ ఆజఁం..
పోలీసులను కొందరు ఁగుండెలు తీసిఁ బంటులు’గా పేర్కొంటారు. కానీ వారిలోనూ మనసునశీ పోలీసు ఆఫీసర్లు -ంటారనే విషయాఁశీ చాలామంది గుర్తెరగరు. అటువంటి వారిలో ఒకరే రాహుల్. ఁకమూఁఁటీ పోలీసింగ్’ అనే ప్రక్రియతోనే ఁలా అండ్ ఆర్డర్’ సాధఁమఁ ఆయన విశ్వసించారు. లాఠీ దెబ్బలు, తుపాకీ గుళ్ల కంటే తన పఁతీరుతో విప్లవాత్మక మార్పు తీసుకఁరావచ్చఁ నమ్మారు ఆయన. ఆ విశ్వాసంతోనే అటు మనఁం, ఇటు మైదఃన ప్రాంత జనాఁకి దగ్గర కాగలిగిన రాహుల్ దేవ్ శర్మ ఈ సంచికలో ఁరియల్ హీరో’
ఆయనకఁ ఆయనే స్ఫూర్తి
విధి ఁర్వహణలో అంకితభావం, వైవిధఁ జీవన విధఃనంలోనూ మనగలగడం.. ప్రజలకఁ మరింత చేరువకావడాఁకి, వారి సమసఁల పరిష్కారాఁకి రాహుల్ ఎనోశీ విధఃనాలను ఎంచుకఁనాశీరు. 45 లక్షలుండే జిల్లా జనాభాలో అఁశీ వర్గాల వారికి తన పఁతీరుతో చేరువ కాగలిగారు. మావోయిస్టుల ప్రభావం ఎకఁ్కవగా -ండే మారుమూల ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకఁ విశేష కృషి చేస్తునాశీరు. జిల్లా కలెక్టర్‌తో కలిసి ఐటీడీఏ అధికారుల సహకారంతో ఎనోశీ సామాజిక సేవా కారఁక్రమాలు చేపట్టారు. ఁసదః్భవన యాత్ర, దర్శిఁ, ముందడుగు, గిరిపుత్రుల అఁుఁదయ యాత్ర, సంజీవఁ కాఁంప్స్, విజయోస్తు, స్ఫూర్తి, సాధన..’ వంటి ప్రజపయోగ కారఁక్రమాలు రాహుల్ పఁతీరుకఁ ఁదర్శనం.
ఁసదః్భవన’తో ముందుకఁ…
మనఁంలో పోలీసుల సదః్భవన యాత్ర మావోయిస్టులపై పోలీసులు పైచేయి సాధించడాఁకి ఎంతో దోహదపడింది. పెదబయలు మండలం ఇంజరిలో ఎస్పీ ముందుండి నడిపించిన యాత్ర విజయవంతం అయింది. మండల కేంద్రఃఁకి సుమారు 40 కి.మీ దూరంలో ఎటువంటి రోడ్డు సదుపాయంలేఁ ఎత్తైన కొండల మధఁ -ంది ఇంజరి గ్రామం. ఈ ఊరుకఁ 40 ఏళ-్లగా ఓ కలెక్టర్ కూడా వెళ్లే సాహసం చేయలేదు. ఇది దట్టమైన అటవీప్రాంతం, పైగా మావోయిస్టుల కంచుకోట. ఇక్కడి ప్రజలు ఁతాఁవసరాల కోసం సుమారు 15 నుంచి 20 కి.మీలు కాలనడక, గుర్రాల మీద రాకపోకలు సాగిస్తుంటారు. బయట ప్రపంచాఁకి ఏమాత్రం సంబంధం లేఁ 48 గ్రామాలు ఇంజరి పంచాయతీలో -నాశీయి. దీంతో పోలీసులు దీఁశీ సదః్భవన యత్ర కోసం ఎంచుకఁనాశీరు. కలెక్టర్ ప్రవీణ్‌కఁమార్, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, ఐటీడీఏ పీఓ రవి హెలికాప్టర్‌లో ఇంజరి గ్రామాఁకి వెళ్లారు. గ్రామాఁకి రోడ్డు ఁర్మించేందుకఁ చరఁలు తీసుకఁంటామఁ కలెక్టర్ అక్కడికక్కడే హమీ ఇచ్చారు. ఁ నాలుగు దశాబ్దాల పాటు ఓపిక పట్టిన మీరంతా కొద్దిరోజులు వేచిచూస్తే సమసఁలఁశీంటికీ పరిష్కారం లభిస్తుంద’ఁ కలెక్టర్ చెప్పిన మాటలు అక్కడి ప్రజలకఁ ఁరోసాఁచ్చాయి. ఁఅసాంఘిక శకఁ్తలకఁ దూరంగా -ంటూ ప్రఁుత్వ పథకాలను సద్విఁయోగం చేసుకోవాలి’ అఁ ఎస్పీ సూచించారు. పోలీసులతో సత్సంబంధఃలు కలిగి -ండాలఁ తెలిపారు. ప్రజలు, అధికారులు కలిస్తేనే అభివృద్ధి సాధఁమఁ, ఆ దిశగా గిరిజనులు సహకరించాలఁ ఎస్పీ పిలుపుఁచ్చారు. గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు కూడా చేశారు. రహదఃరులు, పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ-్ల, వైదఁం, తాగునీరు తదితర సమసఁలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్, అధికారులను వెంటబెట్టుకొఁ అక్కడి రెడ్‌జోన్‌లోకి వెళ్లి గిరిజన జీవన ప్రమాణాలను కళ్లకఁ కట్టినట్టు చూశారు. ఁటాప్ కాప్స్ రెడ్‌జోన్’, ఁమావోల కోటలో సదః్భవన యాత్ర’ అంటూ ప్రధఃన పత్రికలనీశీ కథనాలు ఇచ్చాయి. పోలీస్‌బాస్ అంటే ఇలా -ండాలంటూ కొఁయాడాయి.
గిరిజన విదఃఁర్థులకఁ ఁముందడుగు’
బాహాఁప్రపంచాఁకి దూరంగా -ంటునశీ విశాఖ గిరిజన విదఃఁర్థులకఁ వాస్తవిక ప్రపంచాఁశీ చూపించాలనేది ఇంకో మంచి ఆలోచన. కమూఁఁటీ పోలీసింగ్‌లో ఇదో కచ్చితమైన ఁముందడుగు’. చింతపల్లి, జీకే వీధి, జీ మాడుగుల మండలాల్లోఁ 100 మంది విదఃఁర్థులను ఎంపిక చేసి .. వాళ్లను మూడురోజులు పారిశ్రామిక యాత్రకఁ తీసుకెళ్లారు. ఎస్పీ రాహుల్ నేతృత్వంలో జరిగిన ఈ కారఁక్రమం ఎంతో ఆహ్లాదంగా సాగింది.స్టీల్‌ప్లాంట్, హర్బర్, రామకృషః బీచ్, ఎయిర్‌పోర్టు, విశాఖ సెబ్ మైరెన్ మూఁజియం.. తదితర ప్రాంతాలను సందర్శించి విదఃఁర్థులు ఎంతో ఆనందఃనుఁూతులకఁ లోనయాఁరు. చదువుతో ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. చెట్టూచేమల మధఁ దట్టమైన అడవిలో బతుకఁలీడుస్తునశీ వారికి ఁకొత్త బంగారు లోకాఁశీ’ చూపంచారు ఎస్పీ రాహుల్.
నేత్ర వైదఁశిబిరం
ఁసర్వేంద్రియానం..నయనం ప్రధఃనం’ అంటారు. ఇంద్రియాలఁశీంటిలోకి కళ-్ల ముఖఁమైనవి. దృష్టిలోపంతో అవస్థ పడుతునశీ గిరిజనుల ఆరోగాఁఁశీ మెరుగుపర్చేందుకఁ విశాఖ పోలీస్‌శాఖ వారు ప్రతేఁక కంటి వైదఁశిబిరాలు ఏర్పాటు చేశారు. జీకే వీధి, మాడుగుల నుంచి 38 మంది గిరిజనులకఁ కంటి ఆపరేషన్లు చేయించిన ఎస్పీ రాహుల్ వారి కళ్లకఁ దేవుడిలా కఁపించారు. రోగులను మూడురోజుల పాటు విశాఖలో -ంచి వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించారు. దర్శిఁ స్వచ్ఛంద సంస్థ సహకారంతో దీఁశీ విజయవంతం చేశారు. శంకర్ ఫౌండేషన్ వారితో మాట్లాడి -చితంగ మందులు కూడా ఇప్పించారు. ఆరోగఁం క్షీణించినా.. ఆర్థిక పరిస్థితులు సరిగా లేక వైదఁం చేయించేకోలేఁ స్థితిలో -నశీ గిరిజనులకఁ ఆపదః్బంధవుడయాఁరు ఎస్పీ. పోలీసు -దోఁగాల్లో ప్రవేశం కోసం ఁర్వహించే రాత పరీక్షకఁ కావాల్సిన తర్ఫీదును కూడా ఇప్పించారు. ఇలా అనేక కారఁక్రమాలు చేపట్టి అఁశీ వర్గాలు, వయస్సుల వారి మనశీనలు చూరగొనశీ వఁక్తి ఎస్పీ రాహుల్ అఁ ప్రశంసలందుకఁంటునాశీరు. పోలీసంటే సామాజిక సేశీహితుడనే మాటకఁ ఁలువెత్తు ఁదర్శనంగా -నశీ రాహుల్ గ్రేట్ ఆఫీసర్‌గా మనశీనలు చూరగొంటునాశీరు. ఁరియల్ హీరో’ మేగజైన్ కూడా ఎస్పీ రాహుల్ శర్మకఁ సిఁ్సయర్‌గా సెలూఁట్ చేస్తుంది.

The post రాహుల్.. ఓ సాహసయాత్ర appeared first on Realhero.in.

]]>
http://www.realhero.in/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%b8%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/feed/ 0
శ్రీమతి పరిమళ హణనూతన్‌ఐపిఎస్ ఎస్పీగా పరిమళ http://www.realhero.in/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%ae%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%ae%e0%b0%b3-%e0%b0%b9%e0%b0%a3%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c%e0%b0%90/ http://www.realhero.in/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%ae%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%ae%e0%b0%b3-%e0%b0%b9%e0%b0%a3%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c%e0%b0%90/#respond Mon, 29 Jan 2018 09:16:21 +0000 http://www.realhero.in/?p=733 14 మండలాలు, 11 లక్షల మంది జనాభాతో కొత్తగా ఏర్పడ్డ సూరాఁపేట జిల్లాను కంటికి రెప్పలా కాపాడుకఁనే భాదఁతను ఎవరు తీసుకఁంటారు? విపరీతమైన క్రైవ్‌ు రేట్, జాతీయ రహదఃరిపై తరచూ జరిగే దొంగతనాలు, -గ్రవాద దఃడులు ఇలా -ద్రిక్తకఁ మారుపేరు అఁపించుకఁనశీ సూరాఁపేట జిల్లాను స్మూత్ అండ్ సాఫ్ట్ జిల్లాగా మర్చాలంటే ఎవరు కరెక్ట్? ఈ సందేహాఁకి సరైన జవాబే శ్రీమతి పరిమళ హణనూతన్‌ఐపిఎస్ ఎస్పీగా పరిమళ మేడవ్‌ు వచ్చాకే సూరాఁపేట సామ్రాజఁం ఊపిరి పీల్చుకఁందంటే అతిశయోక్తి ...

The post శ్రీమతి పరిమళ హణనూతన్‌ఐపిఎస్ ఎస్పీగా పరిమళ appeared first on Realhero.in.

]]>
14 మండలాలు, 11 లక్షల మంది జనాభాతో కొత్తగా ఏర్పడ్డ సూరాఁపేట జిల్లాను కంటికి రెప్పలా కాపాడుకఁనే భాదఁతను ఎవరు తీసుకఁంటారు? విపరీతమైన క్రైవ్‌ు రేట్, జాతీయ రహదఃరిపై తరచూ జరిగే దొంగతనాలు, -గ్రవాద దఃడులు ఇలా -ద్రిక్తకఁ మారుపేరు అఁపించుకఁనశీ సూరాఁపేట జిల్లాను స్మూత్ అండ్ సాఫ్ట్ జిల్లాగా మర్చాలంటే ఎవరు కరెక్ట్? ఈ సందేహాఁకి సరైన జవాబే శ్రీమతి పరిమళ హణనూతన్‌ఐపిఎస్ ఎస్పీగా పరిమళ మేడవ్‌ు వచ్చాకే సూరాఁపేట సామ్రాజఁం ఊపిరి పీల్చుకఁందంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే కొత్త జిల్లాలో ఆమె చేసిన సేవలు జిల్లా జనంలో ఆమె ఁంపిన స్ఫూర్తి అటువంటిది. ఆస్తి తగాదఃలు ట్రాఫిక్ సమసఁలు మహిళ ఁద్రత ఇలా ఒక ప్రాధఃనఁత క్రమాఁశీ ఁర్మించుకఁఁ యాక్షన్ ప్లాన్‌తో ముందుకఁ వెళ్ళడం ఆమె వర్కింగ్ స్టైల్. అవిభాజఁ నల్గొండ జిల్లాకఁ ఇంతకఁముందు అడిషనల్ ఎస్పీగా పఁచేసినప్పటి అనుఁవం ఆమెకఁ సూరాఁపేట జిల్లాను సురక్షితం చేయడంలో తోడ్పడింది. ఇందుకోసం ఆమె ఎంత పాటుపడ్డారు, ఎంత శ్రమకోడ్చారు. ఎఁశీ అవరోధఃలిశీ దఃటారో చెప్పాలంటే పేజీలు కావు పుస్తకాలే సరిపోవు. చినశీ రోడ్లు దంతో ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులు వీటితోనే అంతకఁ ముందటి రోజుల్లో ఇబ్బంది పడ్డ జనాఁశీ ముఁసిపల్ అడ్మిఁస్ట్రేషన్ సహకారం తీసుకఁఁ పూర్తిగా సేద తీర్చారు ఎస్ పి పరిమళ. వాహనాలఁ విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం దః్వరా తమకఁ తామే కష్టాఁశీ కొఁ తెచ్చుకఁంటునాశీమనే అవగాహన ప్రజల్లో కలిగేలా ఆమె శ్రమించారు. చౌకబియఁం, ఇసుక అక్రమ రవాణా మీద -కఁ్కపాదం మోపారు. తెలంగాణా రాష్ర్టంలో రెండవ అతిపెద్ద జాతర శ్రీ పెద్దగట్టు లింగమంతుల స్వామి వారి జాతర ఁకఁ్తలకఁ ఎటువంటి ఇబ్బందులు కలగకఁండా ఈ జాతర విజయవంతమైనదంటే ఆ క్రెటిట్ మొత్తం సూరాఁపేట పోలీస్ శాఖదే జిల్లా ఏర్పడ్డ తొలిరోజుల్లోనే జరిగిన కాఁస్టేబుల్ రాత పరీక్షలఁ ఎటువంటి గడబిడ లేకఁండా ఁర్వహించారు. 12వేల మంది అఁఁర్ధుల కోసం 27 కేంద్రఃలను ఏర్పాటు చేసి దగ్గరుండా రాతపరీక్షను దిగ్విజయం చేశారు. ఇలా ఆమె సూరాఁపేట ఎస్పీ సాధించిన విజయాల జాబితాకఁ కామాలేతప్ప పుల్‌స్టాప్‌లు వుండవు.

అపూర్వ సేశీహితురాలు
తెలంగాణా రాష్ర్టంలో ఏ జిల్లాలో లేఁ విధంగా సూరాఁపేట జిల్లాలో మాత్రమే సేశీహిత మహిళ పోలీస్ టీవ్‌‌సు ఁ ఏర్పాటు చేసింది. స్పెషల్లీ డిజైన్డ్ జాకెట్స్ టూవీలర్‌లు అందించారు. పోలీస్ స్టేషన్ కఁ వచ్చి ఫిరాఁదు చేయలేఁ మహిళల వద్దకఁ తామే వెళ్ళి సమసఁలు పరిష్కరించడం సేశీహిత లక్షఁం. మహిళా పోలీసుల ఆత్మరక్షణకఁ కరాటేలో శిక్షణ ఇప్పించారు. మహిళల రక్షణకఁ తెలంగాణా రాష్ర్ట ప్రఁుత్వం ఁర్వహిస్తునశీ షీటీవ్‌‌సుకఁ సేశీహిత బృందఃలు అందువల్ల సూరాఁపేట జిల్లా పరిధిలోఁ మహిళల రక్షణ ఁద్రతా మరియు బరోసా గాఁరెంటీ.
టెకాశీలజీలో సూపర్ స్పీడ్
పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాఁశీ -పయోగించుకోవడంలో ఎస్పీ పరిమళ ఎప్పుడూ ముందుంటారు. ఇందులో భాగంగానే అనుమాఁత వఁకఁ్తలను అక్కడికక్కడే తఁఖీ చేసి ఁర్ధారించే అతఁంత ఆధుఁక వఁవస్థ ఎఫ్.ఐ.ఎన్.ఎస్. ఫింగర్ ఫ్రింట్ ఐడెంటిఫికేషన్ అండ్ నెట్‌వర్కింగ్ సిస్టవ్‌ు ఏర్పాటయింది. జిల్లాలోఁ అఁశీ ఠాణాల్లో దీఁకి సంబంధించిన పరికరాలను అందుబాటులో వుంచారు. తెలంగాణా రాష్ర్టంలోనే ఇదే తొట్టతొలి ప్రయోగం పోలీస్ శాఖల పారదర్శకతను భాదఁతను పెంచుతూ అతాఁధుఁక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన జీపిఎస్ తో కూడిన ఁరాపిడ్‌కాప్’ అనే కొత్త అప్లికేషన్ ను జిల్లా పోలీస్ శాఖలో ఏర్పాటు చేసే ప్రతి పోలీస్ వాహనాఁకి గ్లోబల్ పొజిషన్ సిస్టవ్‌ు జిపిఎస్ ను అనుసంధఃనం చేశారు.
సేఫ్ టౌన్, సేపెస్ట్ కాలనీ, సేఫెస్ట్ విలేజ్
చోరీలు సంఘ వఁతిరేఖ కారఁకలాపాలకఁ చెక్ పెట్టడిఁకి సూరాఁపేటలో పడ్డ మరో ముందడుగు సేప్‌టైన్, సేఫెస్ట్ కాలనీ, సేఫెస్ట్ విలేజ్. ఇదికూడా రాష్ర్టవాఁప్తంగా పేరుతెచ్చిపెట్టిన కారఁక్రమం కోదఃడను సేఫ్‌టౌన్ పైలెట్ ప్రాజెకఁ్టగా ఎంపక చేసుకఁఁ స్థాఁకఁల వివరాలు సేకరిస్తూ నేరాల ఁర్మూలనకఁ కృషి చేస్తునాశీరు లోకల్ ఖాఖీలు. ఈ నేపథఁంలోనే కోదఃడలో 84సీసీ టీవీ కెమెరాలు గ్రామాల్లో రక్షఖ దళాలు ఏర్పాటు అయాఁయి. స్టేషన్‌కఁ వచ్చే భాదితుల పట్ల మరాఁదను పెంచడం కోసం ఁరోసా కల్పించడం కోసం జిల్లా పోలీసులఁ -దుఁక్తం చేశారు. ప్రతి సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే ప్రతీ శ-క్రవారం డయల్ యువర్ ఎస్పీ. ఇలా అనేక రకాల కారఁక్రమాలతో ప్రజల సమసఁలను స్వయం తెలుసుకఁఁ సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తునాశీరు. ప్రజల్లో మూఢ నమ్మకాలను తొలగించడాఁకి పోలీస్ కళాజాత బృందఃఁశీ ఏర్పాటు చేసి గ్రామాల్లో సాంసృ్కతిక కారఁక్రమాలు ఁర్వహిస్తునాశీరు. ప్రతి గ్రామాఁకి ఒక గ్రామ పోలీస్ అధికారిణి ఁయమించి గ్రామ సఁలు పల్లె ఁద్ర కారఁక్రమాలఁ పరిపాటిగా మార్చేశారు.
డ్రైవ్ సేఫ్ అరైవ్ సేఫ్
రోడ్డు ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోవద్దు ఏ ఒక్క కఁటుంబం వీధిన పడకూడదు. ఈ -ద్ధేశంతో రోడ్డు ఁద్రతా రోడ్డు ప్రమాదఃల ఁవారణపై జిల్లాలో స్థాఁక ప్రజలు విదఃఁర్ధులతో కలిసి అనేక అవగాహన కారఁక్రమాలు ఁర్వహిస్తునాశీరు. ట్రాఫిక్ ఁబంధనలపై మేలుకొలుపు అఁ డాకఁఁమెంటరీ రూపొందించి లోకల్ టీవీఛానల్స్‌లో సిఁమా హాల్స్‌లో ప్రదర్శించేలా చరఁలు తీసుకఁనాశీరు. ఎస్పీ పరిమళ. కోదఃడ సూరాఁపేట, హుజుర్ నగర్ పట్టణాల్లో ట్రాఫిక్ సిగశీల్స్ ఏర్పాటు అవసరమైన చోట వాహనాల మళ్ళింపు రోడ్డును ఆక్రమించి వాఁపారాలు ఁర్వహించే వాఁపారుల యొక్క దుకాణాల తొలగింపు తోపుడుబళ్ళ వాళ్ళఁ క్లియర్ చేయడం ఇటువంటి చరఁలఁశీ కొత్త జిల్ల కొత్త ఎస్పీ వచ్చాకే షురూ అయింది.
మన ఆరోగఁమే ప్రజల రక్ష!
ప్రపంచ ఆరోగఁ దినోత్సవ సందర్భంగా దురాజుపల్లి ప్రతిష్ట ఫార్మసీ కళాశాలలో జిల్లా పోలీస్ సిబ్బందికి వారి కఁటుంబీలకఁ ఁర్వహించిన -చిత మెగా వైదఁ శిబిరం ఒక సూపర్ సక్సెస్. 25 మంది డాక్టర్స్ 60 మంది వైదఁ సహాయకఁల నేతృత్వంలో 710 మంది పరీక్షలు ఁర్వహించుకఁనాశీరు. జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ ముఖఁ అతిధిగా విచ్చేసి ఎస్పీ పరిమళ హణనూతన్ ఐపిఎస్ గారి సేవాదృక్పధఃఁశీ ప్రశంసించారు. దేశ సరిహద్దుల్లో సైఁకఁడు దేశాఁశీ కాపాడుతుంటాడు.అదే ఇక్కడ పోలీస్ సిబ్బంది అనుక్షణం విధులు ఁర్వహిస్తూ ప్రజలకఁ రక్షణ కల్పిస్తూ -ంటారఁ పోలీస్ సిబ్బంది ఆరోగఁం బాగుంటేనే సమాజ శ్రేయస్సు సాధఁమవుతుందఁ చెప్పారు. జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రతేఁకంగా చొరవ తీసుకఁంటే మేళ్ళచెరువు ప్రాధమిక ఆరోగఁకేంద్రఃఁశీ దత్తత తీసుకఁనశీ ఎస్పీ పరిమళకఁ అనీశీ వర్గాల నుంచి అభినందనలు దొరికాయి.
-దోఁగపరంగా తన విధులిశీ సక్రమంగా ఁర్వహిస్తూనే శాఖాపరంగా కూడా అంతర్గత ప్రజాస్వామఁం కోసం పాటుపడడం మేడం పరిమళ కఁండే మరో స్పెషాలిటీ ప్రతీ శ-క్రవారం ఁర్వహించే సూరాఁపేట జిల్లా గ్రీన డే లో మొక్కల పెంపకం పోలీస్ కారాఁలయంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు సిబ్బంది ప్రజల సౌకరఁం కోసం పోలీస్ అంబులెస్స్ సిబ్బందిలో -త్సాహం ఁంపడాఁకి సిబ్బందికి పోలీస్ వార్షిక క్రీడాపోటీలు ల ఖాఖీ సహచరుల మనసులో స్థానం సంపాదించేశారు ఎస్పీ పరిమళ.
ప్రజాజీవితం సేఫ్ అండ్ సెకూఁరిటీ గా -నశీప్పుడే అభివృద్దికి ఆర్దికాభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందఁ ఎస్పీ పరిమళ గారి అభిమతం. ఇష్టంతో పఁచేస్తే ఎంతటి వత్తిడినైనా జయించవచ్చనశీది ఏవృత్తిలోనైనా పాటించాల్సిన పరమసూత్రం దఃఁశీ తూచ తప్పకఁండా పాటించే పరిమళ ఇతరులకఁ ఆదర్శంగా ఁలుస్తునాశీరు. డిపార్టమెంట్‌లో పఁచేసే సహచర సిబ్బందికి ఆమె తాను నమ్మిన సిదః్దంతాలిశీ జీవన సూత్రాఁశీ చెబుతూ వాళ్ళలో పఁపట్ల -త్తేజాఁశీ పెంచుతూ -ంటారు. ప్రజలకఁ సేవ చేసే అవకాశం దొరకడం మన అదృష్టమఁ కష్టం చెప్పుకోవడాఁకి మన దగ్గరకఁ వచ్చే బాధితుల పట్ల మరాఁదగా ప్రవర్తించాలఁ సమయపాలన క్రమశిక్షణ వృత్తి జీవితంలో ముఖఁమఁ చెబుతుంటారు. విశ్రాంతి సమయాల్లో కఁటుంబీకఁలతో గడపడం డూఁటీలో దిగేటప్పుడు మానసిక ప్రశాంతత కలిగివుండడం ప్రొఫెషనల్ లైఫ్ ఁ పరిపుష్టం చేస్తుందఁ ఆమె నమ్ముతారు ఇతరులఁ నమ్మిస్తారు.
పరిపాలన సౌలఁఁం కోసం రాష్ర్టవాఁప్తంగా 31 చినశీ జిల్లాలఁ ఏర్పాటు చేసి నల్గొండ జిల్లాను విఁజించి రెడు జిల్లాలుగా నామకరణం చేసిన సీఎం కేసీఆర్ కల సంపూరఃంగా సాకారం కావాలంటే పరిమళ ఐపిఎస్ లాంటి ఁకార్సయిన అధికారులు మరికొందరుంటే చాలనశీది రాష్ర్ట ప్రజలు అనకఁంటునశీ మాట.
ఎస్పీపరిమళ

The post శ్రీమతి పరిమళ హణనూతన్‌ఐపిఎస్ ఎస్పీగా పరిమళ appeared first on Realhero.in.

]]>
http://www.realhero.in/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%ae%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%ae%e0%b0%b3-%e0%b0%b9%e0%b0%a3%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c%e0%b0%90/feed/ 0
ప్రజా రక్షకులకు భద్రత ఉందా? http://www.realhero.in/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%ad%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4-%e0%b0%89%e0%b0%82/ http://www.realhero.in/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%ad%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4-%e0%b0%89%e0%b0%82/#respond Mon, 29 Jan 2018 08:35:16 +0000 http://www.realhero.in/?p=728 దేశంలోనే మొత్తం చేసిన పనికి ఏ మాత్రం విలువలేని ఉద్యోగులెవరున్నా ఉన్నారా అంటే అది ఒక్క పోలీసు ఉద్యోగులే. ఔను! దేశ సరిహద్దుల్లో ఆహోరాత్రులు కాపలా కాస్తూ మనకు రక్షణ కల్పించేది సైనికులైతే.. సమాజంలో అడుగడుగునా మనకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడే పోలీసుల కష్టానికి సరిపడా జీతాల మాట దేవుడెరుగు, కనీసం గుర్తింపు కూడా తక్కువే. పొట్టకూటి కోసం పోలీసు ఉద్యోగంలో చేరిన పాపానికి సొంత ఇంటి కష్టసుఖాలను దేవుడికి వదిలేసి ...

The post ప్రజా రక్షకులకు భద్రత ఉందా? appeared first on Realhero.in.

]]>
దేశంలోనే మొత్తం చేసిన పనికి ఏ మాత్రం విలువలేని ఉద్యోగులెవరున్నా ఉన్నారా అంటే అది ఒక్క పోలీసు ఉద్యోగులే. ఔను! దేశ సరిహద్దుల్లో ఆహోరాత్రులు కాపలా కాస్తూ మనకు రక్షణ కల్పించేది సైనికులైతే.. సమాజంలో అడుగడుగునా మనకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడే పోలీసుల కష్టానికి సరిపడా జీతాల మాట దేవుడెరుగు, కనీసం గుర్తింపు కూడా తక్కువే. పొట్టకూటి కోసం పోలీసు ఉద్యోగంలో చేరిన పాపానికి సొంత ఇంటి కష్టసుఖాలను దేవుడికి వదిలేసి ప్రజలు శాంతియుతంగా జీవించడానికి పాటుపడే పోలీసులు బయటకు కనిపించని దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఈ శాంతియజ్ఞంతో తమ ప్రాణాలను ధారపోస్తున్నారు. పోలీసు లేనిదే ఒక్క గంట ? గడపలేని రాజకీయ నాయకులు తాము అధికారంలో ఉన్నప్పుడయినా పోలీసుల సమస్యలపై దృష్టి సారించకపోవడం దారుణం. రాజకీయ నాయకులే కాదు పోలీసుల పుణ్యమా అని ఇళ్ళల్లో గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోగలిగే కోట్లాది మంది ప్రజలు తరచుగా పోలీసులనే ఆడిపోసుకోవడం విషాదం. పూర్వపు రోజుల్లో కాశీకి వెళ్ళితే కాటికి వెళ్ళినట్లే అనే వారు. కానీ ఇప్పుడు పోలీసు ఉద్యోగి ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తే తిరిగి ??????ి క్షేమంగా వస్తాడన్న గ్యారంటీ ఉండదు. అంతా ప్రశాతంగా ఉందనుకుంటేనే పన్నెండు నుంచి పదిహేను గంటలు పనిచేసే పోలీసులు ఇక ఏపాటి గందరగోళాలు నెలకొన్నా ఆహోరాత్రులు డ్యూటీలో ఉండాల్సిందే.

తీరని మారని పాలక వ్యవస్థ…
బ్రిటీష్ పాలకులు మన దేశం వదిలి వెళ్ళకముందు ఉన్న పోలీసు మాన్యువల్ మనం ఇప్పటి వరకు అమలుచేసుకుంటున్నాం. మన దేశాన్ని వందలు సంవత్సరాల పాటు దోచుకుపోయిన తెల్లవాడి నిబంధనలను ఇప్పటికీ మనం తూచ తప్పకుండా పాటించేస్తున్నాం. కాలానుగుణంగా పోలీసులు స్థితిగతుల్లో కాని,వారి జీవన స్థితిగతుల మెరుగుదలకు ప్రభుత్వాలు అవసరమైనంత మేరకు స్పందించలేదనే చెప్పాలి. ఏ ప్రభుత్వ డిపార్ట్‌మె్ంలలోను లేని క్రమశిక్షణ పోలీసు శాఖలోనే ఉంటుంది. తమ సమస్యలపై గొంతెత్తడానికి లేదు. జీతాలు పెంచండి మహాప్రభో అంటూ అడగడానికి లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇతర అలవెన్స్‌లు ఇమ్మని విజ్ఞప్తి చేయడానికి లేదు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తాను జీతాల గురించి, డిమాండ్ల పరిష్కారం గురించి, ఏడాదికో రెండేళ్ళకో ఒకసారి సమ్మె నోటీసులు ఇవ్వడం మనము చూస్తూ ఉన్నాం. వాళ్ళు అలా నోటీసులు ఇవ్వగానే ప్రభుత్వం చర్చలకు పిలిచి ఎన్నో కొన్ని డిమాండ్లను పరిస్కరించడం మనకు తెలుసు. కానీ దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు పోలీసులు సమ్మె చేసిన పాపాన పోలేదు. ఎందుకంటే ఈ క్రమశిక్షణ పోలీసుల పాలిట శిక్షగానే పరిణమిస్తోంది. జీతాలు.. భత్యాలే కాదు సెలవుల విషయంలోనూ పోలీసుల పరిస్థితి దారుణమే. వాళ్ళకి పండగలు ఉండవు, పబ్బాలుండవు చాలా సందర్భాలలో వీక్లీ ఆఫ్‌లు ఉండవు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తమ కుటుంబాలతో విలాసాలకు, వినోదయాత్రలకు, వెళ్తూ ఉంటారు. కానీ పోలీసులకు అంది అందని ద్రాక్షే. పండుగ రోజు ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లవ్‌ు వచ్చిన ఇంటిని వదిలి డ్యూటీలో చేరాల్సిందే.

నక్సలిజం…
మన రాష్ర్ట విషయానికి వస్తే 1969 నుంచి రెండేళ్ళ క్రితం వరకు నక్సలిజం సమస్య చాలా ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో అటు ప్రజాప్రతినిధులను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమరులైన పోలీసులకు కొదవేలేదు. ఇంత త్యాగం చేస్తే ఏడాదికోసారి అమర పోలీసు జవానులకు సంస్మరణ దినం పేరిట ఒకసారి గుర్తుకు తెచ్చుకోవటం తప్ప ఆ త్యాగధనులకు ప్రభుత్వం చేసిందేమి ఉండదు. ఇక ఇతర సంఘ విద్రోహక శక్తులకు రాజకీయ నాయకుల అండదండలుండడంతో పోలీసులు పడ్డ శ్రమ కాస్తా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ జాడ్యం అన్ని రాజకీయ పార్టీలలోని ఉంది. అలాగని రాజకీయనాయకులంతా అలాగే ఉంటారని కాదు. నిజాయితీగా ఉండే రాజకీయ నేతలు ఉన్నారు. కాకపోతే గంజాయి వనంలో తులసి మొక్కల్లా వారి సంఖ్య చాలా తక్కువ ప్రజా ప్రతినిధులకు సెక్యూరిటీ పేరిట వారి ఊరేగింపులకురక్షణ పేరిట ఉదయం లేచిన దగ్గర నుంచి రాజకీయ నాయకులకు, ఇతర వి.ఐ.పి.లకు పోలీసులు లేనిదే క్షణం ముందుకు పోలేరు. రాజకీయ జోక్యాలు లేకపోతే ఏ కేసునైనా సరే క్షణాల్లో తేల్చిపారేయడంలో మన పోలీసులు స్కాట్‌ల్యాండ్ పోలీసులకు ఏ మాత్రం తీసిపోరని చెప్పడం అతిశయోక్తి కాబోదు. దేశ పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్న పోలీసులు మరెవరో కాదు కనిపించని నాలుగో సింహమే పోలీసు. ఓ వ్యాస్, ఓ ఉమేస్ చంద్ర లెక్కకు మించిన పోలీసు అమరవీరులకు లోటేలేదు. లా అండ్ ఆర్డర్‌ని ఇంత సమర్దవంతంగా కాపాడుకుంటూ పోలీసు ఉద్యోగుల సంక్షేమం గురించి ఒక క్షణం ఆలోచించినా, వాళ్ళకు జరుగుతున్న నష్టం అర్థమవుతుంది.

విశృంఖలంగా పెరిగిపోయిన మీడియా?
విశృంఖంగా పెరిగిపోయిన మీడియా కూడా పోలీసులను మనస్ఫూర్తిగా డ్యూటీ చేసుకోనివ్వ నంటోంది. కానిస్టేబుల్ నుంచి డి.జి.పి దాకా అన్ని స్థాయిల్లో ఖాకీదారుడు అనవసర విషయాల్లో పట్టుబడుతున్న దాఖలాలు కోకొల్లలు. ఇటీవల చేసిన చిన్నపాటి కామెం??????ి.. చిలువలు పలువలుగా మారి, నానారాద్ధాంతం సృష్టించింది. అత్యాచారాలకు దారితేసే కారణాల్లో అమ్మాయిల వస్త్రదారణ కూడా ఒకటన్న మాజీ డిజిపి వ్యాఖ్యాల్లో తప్పేమి లేదని సర్వత్రా తెలుసు. అయితే… మాజీ డిజిపిని ఏకాకిని చేసి, మహిళా సంఘాలను వెనకేసుకొచ్చి, ప్రజల్లో పోలీసుల పట్ల వ్యతిరేకతను పెంచడానికి కొన్ని మాధ్యమాలు కంకణం కట్టుకోవడం శోచనీయం. పోలీసు అధికారుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడ్డం, రచ్చ చేయడం, బజారుకీడ్చడం ఇవన్నీ కొన్ని మీడియా సంస్థల దూకుడులో భాగాలైపోయాయి. ఇందువలన ముందునుయ్యి వెనుక గొయ్యి తవ్విపెట్టి పోలీసును కదలనివ్వకుండా చేస్తుంది. ప్రస్తుత సమాజ పోకడలో ప్రేమోన్మాదులు రెచ్చిపోయిన సందర్భాలలో వారి రాక్షసత్వాన్ని చూసి ప్రజలందరూ చలించిపోతారు. పట్టిస్తే.. కొట్టి చంపేస్తామంటూ రెచ్చిపోతారు కానీ, అరెస్టులు, దర్యాప్తులు, కోర్టులు, విచారణలు, శిక్షణ అంటూ భవిష్యత్తులో శ్రమ తగ్గించడం కోసం.. భూమికి భారమనుకున్న ఉన్మాదుల్ని ఎన్‌కౌంటర్ చేస్తే, ఆహ పోలీసుల్లో ఎంత గొప్ప సామాజిక సృ్తహ అంటూ.. కొన్ని గొంతులు వెల్డన్ చెబితే మరి కోర్టులెందుకు, శిక్షలెందుకు? అంటూ వేలాది డౌన్ డౌన్ నినాదాలు వినిపిస్తాయి. ఏం ఖాకీకి ఆ మాత్రం విచక్షణ అక్కర్లేదా..? అతను మాత్రం.. మనసు పెట్టి ఆలోచించకూడదా? సొగసైన సమాజం కోసం హద్దుమీరితే తప్పెందుకవుతుంది..? ప్రజల్లో ఆలోచన మారాలి. ఈ రకమైన వివేచన పెరగాలి.
పోలీసు వెంకటస్వామి గుండె రగిలిపోతోంది. భుజాల మీద వున్న నక్షత్రాలు వాణ్ణి చూసి వెకిలిగా నవ్వుతున్నాయి. డ్యూటీ తీసుకున్న తొలిరోజు ప్రమాణ పత్రం గుర్తుకొచ్చి.. వాడి కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూస్తోంది. వెక్కిరిస్తున్న విధి నిర్వాహణ అతగాడి ముందరికాళ్ళకు బేడీలేస్తుంది. ఏయ్ టూనాట్ ఫోర్ ఏం చేస్తున్నావక్కడ. ఒక అదిలింపుతో పోలీసు ఈ లోకంలోకొచ్చాడు. ఏమిటీ తన బ్యూటీ ఎందుకీ భుజకీర్తులు..? ఉలిక్కిపడ్డాడు. అవును.. సగటు పోలీసు ఇప్పుడా విధి వంచితుడు. ??????దారుడు తన కేస్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చూసుకునే సదుపాయం వచ్చింది. నేషనల్ క్రైం బ్యూరో రికార్డులు, నేరాల మోతాదుల్ని తీరు తెన్నుల్ని ఎప్పటికప్పుడు అందరికి పంచిపెడుతుంది. ప్రతీది సైబరీకరణ జరిగి ఏది కావాలన్నా సులభంగా క్షణాల్లో దొరికిపోతుంది. ఇదే మోతాదులో నేరగాళ్ళ తెలివితేటు కూడా మితిమీరిపోచాయి. మన హైదరాబాద్ విదేశీ నేరాల అడ్డాగా మారిపోయిందని డ్రగ్స్ నుంచి హత్యల దాకా నేరన్రనంచానికంత మన నడిడ్డే గరిమనాభిగ మారిపోయిందని చాలా దుష్పరిణామాలు లెక్కలేసి చెప్తున్నాయి. కానీ.. ఇన్ని మాఫియాలను నియంత్రిం చాల్సిన పోలీసు చేతుల్లో మాత్రం.. విష్ణుచక్రాల్లేవు. తప్పు పట్టిన నాటిన నాట్‌నాట్ సెంచరీ నాటి రైఫిళ్ళు తప్ప వామపక్ష తీవ్రవాద నిర్మూలనలో సెబాష్‌లు కొట్టించుకున్న తెలుగు ఖాకీల దగ్గర. ఏ టార్గెట్లిచ్చినా విరోచితంగా పోరాడే ప్రతిభ వుంది. కానీ. ఆ పోరుకు తగిన వాతావరణం భుజం తట్టి ముందుకు నడిపించే ప్రోత్సాహమే సర్కారు దగ్గర లేదు.

The post ప్రజా రక్షకులకు భద్రత ఉందా? appeared first on Realhero.in.

]]>
http://www.realhero.in/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%ad%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4-%e0%b0%89%e0%b0%82/feed/ 0
నాపేరు రాజకుమారి.. నా ఇల్లు రాజమండ్రి.. http://www.realhero.in/%e0%b0%a8%e0%b0%be%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%87%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2/ http://www.realhero.in/%e0%b0%a8%e0%b0%be%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%87%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2/#respond Mon, 29 Jan 2018 07:40:27 +0000 http://www.realhero.in/?p=723 ’నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ఒక పవర్ ఫుల్ సైనికుడి పంచ్ డైలాగ్! ’నా పేరు రాజకుమారి.. నా ఇల్లు రాజమండ్రి’ అనేది ఒక సిన్సియర్ మోస్ట్ పోలీసధికారిణికి సూటయ్యే చక్కటి మాట! ఆశయం, ఆత్మబలం, అంకితభావం.. ఈ మూడూ కలగలిస్తే ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యమవుతుందనడానికి ఆమె ఒక నిలువెత్తు సాక్ష్యం! కర్తవ్య దీక్షకు ఖాకీ చొక్కా తొడిగితే ఎలా ఉంటుందో అలా వుంటుందీమె మేనరిజం! శ్రీమతి బూరుగు రాజకుమారి ఐపీఎస్.. 2007 బ్యాచ్.. ...

The post నాపేరు రాజకుమారి.. నా ఇల్లు రాజమండ్రి.. appeared first on Realhero.in.

]]>
’నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ఒక పవర్ ఫుల్ సైనికుడి పంచ్ డైలాగ్! ’నా పేరు రాజకుమారి.. నా ఇల్లు రాజమండ్రి’ అనేది ఒక సిన్సియర్ మోస్ట్ పోలీసధికారిణికి సూటయ్యే చక్కటి మాట! ఆశయం, ఆత్మబలం, అంకితభావం.. ఈ మూడూ కలగలిస్తే ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యమవుతుందనడానికి ఆమె ఒక నిలువెత్తు సాక్ష్యం! కర్తవ్య దీక్షకు ఖాకీ చొక్కా తొడిగితే ఎలా ఉంటుందో అలా వుంటుందీమె మేనరిజం!

శ్రీమతి బూరుగు రాజకుమారి ఐపీఎస్.. 2007 బ్యాచ్.. ఇప్పుడు రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీగా వున్నారు. పక్కనుండే ఏలూరే ఆమె పుట్టినూరు. ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. సివిల్ సర్వీసెస్ మీద మక్కువ కారణంగా పోలీస్ ప్రొఫెషన్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. గతంలో మంగళగిరి ఏపీఎస్పీ కమాండెంట్ గా, గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా, రంగారెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. నూజివీడు, నిజామాబాద్, నల్గొండ జిల్లాలో కీలక సర్వీసులు నిర్వర్తించారు. 2016 మేనెల 16న రాజమహేంద్రవరం అర్బన్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఛార్జ్ తీసుకుని.. అక్కడి ప్రజానీకానికి బాగా దగ్గ్గరయ్యారు.

పోలీసంటే.. పి ?పాజిటివ్’!
ప్రజల శాంతిభద్రల్ని పర్యవేక్షించడం అనేది అత్యంత సంతృప్తికరమైన ఉద్యోగం.. మన సమాజంలో ఇంతకంటే ఉన్నతమైన వృత్తి ఏదీ లేదని నేను భావిస్తాను’’ ఈ మాట ఎస్పీ రాజకుమారి నోటి నుంచి కాదు మనసు నుంచి వచ్చింది. తన వృత్తి మీద తనకు ఎంతటి ఆత్మ సంతృప్తి వుందన్నది ఈ ఒక్క మాట దగ్గరే అర్థమవుతుంది. ప్రజల ధన, మాన, ప్రాణాల్ని కాపాడే బృహత్తర బాధ్యతను మోస్తున్నందుకు ప్రజాస్వామ్యానికి మనమెంతో రుణపడివున్నామంటూ ఆమె ఎన్నోసార్లు చెబుతారు. రాజమండ్రి పట్టణ ఎస్పీగా ఆమె చేపట్టే ప్రతీ చర్యలోనూ ఆ ’కమిట్మెంట్’ స్పష్టంగా కనిపిస్తుంది.

శిలలపై శిల్పాలు చెక్కినారు!
పీసీలుగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు.. అవును ఇది కనిపిస్తున్న వాస్తవం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన ఉన్నత విద్యావంతులు సైతం కానిస్టేబుళ్లుగా చేరుతున్నారు. వీళ్లందరి నైపుణ్యతను నేరాల నిర్మూలనకు ఉపయోగించుకోవాలని ఎస్పీ రాజకుమారి చెబుతున్నారు. రాజమండ్రిలో జరిగిన ఏఆర్ మహిళా కానిస్టేబుల్ శిక్షణా తరగతుల సమయంలో ఆమె కొత్తగా ఉద్యోగంలో చేరిన విమెన్ కానిస్టేబుళ్లను కదిలించి వాళ్ళ మనోభావాల్ని అడిగి తెలుసుకున్నారు. 13 జిల్లాల నుంచి ఎంపికైన 181 మందికి 9 నెలల పాటు జరిగిన ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ’ఒక శిలగా శిక్షణకొచ్చారు. శిక్షణ తర్వాత ఒక శిల్పంగా రూపాంతరం చెంది బయటకు వెళ్ళాలి అంటూ ఆకాంక్షించారు. ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని భుజం తట్టేవారు.

షీ టీమ్స్ వెనుక ’ఆమె’ కృషి
షి టీమ్స్‌ని మహిళలకు రక్షణ కవచాల్లా పనిచేయించడంలో రాజమండ్రి పట్టణ పోలీసు విభాగం ప్రత్యేక చొరవ చూపించింది. వాట్సాప్, ఈమెయిల్, ప్రత్యేక యాప్‌ల సాయంతో చురుగ్గా పనిచేస్తున్న షి టీమ్స్ పై స్థానికంగానే కాక.. బైటి నుంచి ప్రశంసలు పడుతున్నాయి. రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో అర్బన్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో షి టీమ్ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్టార్ షట్లర్ పీవీ సింధు చీఫ్ గెస్ట్‌గా హాజరై.. రాజమండ్రి షీ టీమ్స్‌ని అభినందించారు. స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు స్థిరనివాసం ఉంటారని, అందుకే మహిళల ఆత్మాభిమానాన్ని రక్షించడానికి షీ టీమ్స్ ని బలోపేతం చేస్తున్నామని ఎస్పీ రాజకుమారి అన్నారు. సమాచారం అందించిన 10నిమిషాల్లోపే ఘటనా స్థలానికి చేరుకొని ఎందరో విద్యార్థినులను ఆడుకున్నామన్నారు. మహిళా రక్షణ కోసం ’యూ సేఫ్’ అనే ప్రత్యేక యాప్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒలింపియన్ పీవీ సింధుతో పాటు, ఎస్పీ రాజకుమారి కూడా అపూర్వ సత్కారం అందుకున్నారు.

పచ్చని తోటలో చల్లని చెయ్యి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి.. మనిషికో మొక్క నాటి మన ఆక్సిజన్‌ను మనమే సంపాదించుకోవాలి.. ఇదీ ఎస్పీ రాజకుమారి ఇస్తున్న ఎకో ఫ్రెండ్లి పిలుపు. లాలాచెరువులో నూతన ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ’వనం-మనం’ కార్యక్రమాన్ని ఆమె దగ్గరుండి నిర్వహించారు. వందలకొద్దీ అందమైన మొక్కలతో గ్రీనరీమయంగా మారింది అర్బన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. పచ్చదనంతో మనసుకు తెలియని చికిత్స జరిగి స్వాంతన చేకూరుతుందన్నది ఎస్పీ రాజకుమారి అభిమతం. ఆమె అభిరుచిని, సామాజిక దృక్పథాన్ని రాజమండ్రి ప్రజలు ప్రశంసించారు.

బెండు తియ్యడమే ఎజెండా
64 కళల్లో చోర కళ ఒకటి. ఇప్పుడీ చోరకళ మరింత కళాత్మకంగా మారిపోయింది. అప్డేట్ అవుతున్న నేరస్తుల్ని అంతకంటే అప్డేటెడ్ గా వెంటాడకపోతే మేం పోలీసులం ఎలా అవుతాం అంటారు రాజమండ్రి అర్బన్ పోలీసులు. ఇందుకోసం లాఠీలకు మరింత పదును పెట్టుకుని, కాసింత కాఠిన్యం చూపించడం మొదలుపెట్టేశారు. పైగా ఇక్కడ.. డైరెక్షన్ మేడమ్ రాజకుమారిది. ఆమె డ్యూటీలో దిగిన తర్వాతే రాజమండ్రిలో పేకాట శిబిరాలు పూర్తిగా మూతబడ్డాయి. లక్ష్మివారపుపేట లాంటి చోట్ల ఆకస్మిక దాడులు జరిపి పేకాటరాయుళ్ల తోళ్ళు వలిచిందామె! మహిళల జీవితాల్ని చెరబట్టే బెల్టు షాపుల మీద సైతం యుద్ధం ప్రకటించింది. మూలగొయ్యి-సీతంపేట ప్రాంతంలో బెల్టు షాపుల్ని సీజ్ చేసి.. మిగతా షాపులవాళ్లకు హెచ్చరిక జారీ చేశారు పోలీసులు.

మత్తు ఇంజక్షన్ల ముఠా ఆటకట్టు
మత్తు మందులు అమ్ముతున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రాజమండ్రి ప్రజలకు రిలీఫ్ నిచ్చారు రాజమండ్రి పోలీసులు. రాజమండ్రి మెయిన్ రోడ్డులో విజయ టాకీస్ వెనుక వీధి.. సాయి కృష్ణ థియేటర్ రోడ్డు వద్ద అర్ధరాత్రి అనుమానంగా సంచరిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని, భారీ స్థాయిలో మత్తు ఇంజక్షన్లు, మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఈ మత్తు ఇంజక్షన్లను ఒక్కొక్కటీ ఐదు రూపాయలకు కొని వాటిని మార్కెట్లో రెండు వందలకు విక్రయిస్తున్నట్టు ఎస్పీ బి.రాజకుమారి చెప్పారు. వీరిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ ఆక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. నాలుగేళ్ల నుంచి నగర ప్రజలను ఆందోళన పరుస్తున్న ఈ మత్తు ఇంజక్షన్ల టెన్షన్ వీడినట్లయింది. అటు.. ఒడిశా నుంచి విశాఖ మీదుగా రాజమండ్రికి డ్రగ్స్ సరఫరా అవుతున్న ఉదంతంపై ఎస్పీ ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ అమ్మకాలపై సమాచారం ఇవ్వాలంటూ తన కార్యాలయం ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఆయిల్ ట్యాంకర్లలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 21,50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
డిసెంబర్ 31న ’జీరో యాక్సిడెంట్’ లక్ష్యంగా పెట్టుకుని సాధించి చూపెట్టారు. కోడి పందేల నియంత్రణ అనే సవాల్ ని కూడా చేతికి తీసుకుని.. ఆ దిశగా ఉక్కుపాదం మోపారు రాజమండ్రి అర్బన్ పోలీసులు. సంక్రాంతి సీజన్లో నకిలీ నోట్ల చెలామణీ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో నిఘా పెంచేశారు. పాతిక లక్షల మేర నోట్లు ముద్రించి కోడి పందేల్లో వెదజల్లడానికి ప్రయత్నాలు జరగడంతో.. పోలీసుల దాడిలో ఈ గుట్టు రట్టయ్యింది. కలర్ జెరాక్స్‌తో తయారయ్యే ఈ నకిలీ కరెన్సీ బెడద రాజమండ్రికి తప్పినట్లే!
ఆటో డ్రైవర్ల ముసుగులో ప్రయాణీకులను దోచుకునే నేరస్తులకు సైతం చెక్ పడింది. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ల ఏర్పాటుతో ప్రజల మన్ననలు పొందారు ఎస్పీ రాజకుమారి. ఇప్పుడు గుండెల మీద చెయ్యేసుకుని పోలీసుల నిఘాలోనే ప్రయాణం చేస్తున్నారు రాజమండ్రి జనం.

హెల్మెట్ లేకపోతే నో ఎంట్రీ!
శిరస్త్రాణం ధరించండి ప్రాణాపాయం నుంచి బయటపడండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా..అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో తామే రంగంలోకి దిగారు రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులు. ముందుగా తాము ఆచరించి చూపించి మిగతావారికి చెబితే బాగుంటందని భావించిన వారు ఇందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించుకున్నారు. ద్విచక్రవాహన చోదకులు శిరస్త్రాణం ధరిస్తేనే అర్బన్ పోలీసు కార్యాలయంలోనికి ప్రవేశం ఉంటుంది. లేదంటే బయటే వాహనాన్ని ఉంచి నడుచుకుంటూ లోపలికి వెళ్లాలి. ఈ నిబంధనను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. వెరైటీ అవెర్నెస్ అంటే ఇదే మరి!
మహిళా పోలీసులతో ఏకంగా హెల్మెట్ ర్యాలీ నిర్వహించి జనంలో చైతన్యం కోసం మరో వినూత్న ప్రయత్నం జరిగింది. హెల్మెట్లు ధరించి మాత్రమే టూవీలర్లు డ్రైవ్ చేయాలన్న నినాదంతో రాజమండ్రి నడివీధుల్లో జరిగిన పోలీస్ బైక్ ర్యాలీ ఒక సూపర్ సక్సెస్! ఇందులో ఎస్పీ రాజకుమార్ సహా ఉన్నత పోలీసాధికారులు అందరూ పాల్గొన్నారు. జనం పట్ల ఇంతకంటే కమిట్మెంట్ ఇంకేముంటుంది అంటూ రాజమండ్రి ప్రజలు చెప్పుకున్నారు.

గుర్తుండిపోయ్యే పుష్కర అనుభవం
ప్రజల భాగ్నస్వామ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని గోదావరి అంత్యపుష్కరాల ద్వారా నేర్చుకున్నానంటారు ఎస్పీ రాజకుమారి. రాజమండ్రిలో కమ్యూనిటీ పోలీసు ఆఫిసర్ వ్యవస్థను ప్రారంభించే సమయంలో ఆమె ఈ విధంగా స్పందించారు. పెరుగుతున్న అవసరాలను బట్టి పోలీసులకు ప్రజల సహకారం తప్పనిసరి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఔత్సాహిక యువత తోడ్పాటుతో పోలీసుల పని సులభతరం చేసుకోవడమనే ఈ తరహా ప్రయోగం ఏలూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో సక్సెస్ అయినట్లే.. రాజమండ్రిలో కూడా సూపర్ సక్సెస్ చేశారు. మొత్తం 2 వేల మంది సీపీఓల్లో అందులో 800 మంది నైట్ డ్యూటీలకు, 400 మందిని ట్రాఫిక్ కి తరలించడం, బీట్ విధానాన్ని పటిష్ఠపర్చడం లాంటివన్నీ ఆమె కార్యాచరణలు. వినాయక ఉత్సవాలు సామరస్యంగా జరుపుకునేలా ఉత్సవ కమిటీలు, మత పెద్దలతో సంప్రదింపులు జరిపి.. ఆ మేరకు విజయవంతమయ్యారు ఎస్పీ రాజకుమారి.

ముఖ్యమంత్రి అభినందన
రాజమండ్రి అర్బన్ జిల్లా పోలీసులకు ప్రత్యేకంగా అభినందించారు సీఎం చంద్రబాబు. నూతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ని పరిశీలించి, అక్కడున్న లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టమ్ డెమోను చూసి.. భళా అన్నారు. నేరాల నియంత్రణకు మీరు పాటించే ఆధునిక విధానం సూపర్ అంటూ ప్రశంసించారు. మినిట్స్ బుక్‌లో తన అభిప్రాయం రాస్తూ.. ఎస్పీ పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సమాజమే దేవాలయం
ప్రజలకు ఆరోగ్యంపై అవగాహనా కల్పించేందుకు వివిధ కార్యక్రమాల ద్వారా కృషి చేయడంలో రాజమండ్రి అర్బన్ పోలీసులు ముందడుగేశారు. జైన్ సేవా సమితి, ధన్వంతరి రక్త నిధి సహకారంతో ఎస్పీఎఫ్ నేతృత్వంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం జరిగింది. అర్బన్ ఎస్పీ రాజకుమారి సహా అనేకమంది పోలీసధికారులు ఇందులో పాల్గొన్నారు. రక్తదానం చేస్తే దైవ సాక్షాత్కారం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ చెప్పారు. గౌతమీ నేత్రాలయం ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి, అవసరమైనవాళ్లకు కళ్లజోళ్లు ఇప్పించారు.

మనోధైర్యమే సగం బలం
మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగినప్పుడే సగం సమస్యలు తీరిపోతాయని ఎస్పీ రాజకుమారి చెబుతారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన 2కె రన్ కార్యక్రమంలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. మహిళలు కూడా సమాజాభివృద్ధిలో భాగం కావాలని ఆమె పిలుపునిచ్చారు. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వృత్తి జీవితాల్లో మహిళలు అనేక పాత్రలు పోషిస్తున్నారని, ఈ క్రమంలో శారీరక, మానసిక ఫిట్నెస్ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. షీ టీమ్స్ నిర్వహించిన ఈ సామాజిక పరుగులో వందలమందితో కలిసి తానూ కదం తొక్కారు.

మై డియర్ స్టూడెంట్స్..
మన ఆలోచనా విధానమే మన భవిష్యత్తుకు పునాదులేస్తుంది. విద్యార్ధి దశలో ఏ విధంగా ఆలోచిస్తామో అదే ధోరణి వాళ్ళ వాళ్ళ విధుల్ని, ఉద్యోగాల్ని శాసిస్తుంది.. అంటారు ఎస్పీ రాజకుమారి. కందుకూరి వీరేశలింగం కళాశాలలో జరిగిన అవెర్ నెస్ ప్రోగ్రాంలో ఎస్పీ చెప్పిన ’సూక్తులు’ అక్కడి విద్యార్థులు మెదళ్లలో నాటుకుపోయాయి. ఎంత నిగ్రహంతో ఉంటే అంతటి ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందన్న ఎస్పీ రాజకుమారి వాచకం.. విద్యార్థిలోకం మొత్తానికి ఆదర్శప్రాయం కూడా. ఒక పోలీసధికారిగా ఉంటూ ఇంత గొప్ప సామాజిక స్పృహ కలిగివుండడం అభినందనీయమంటూ అక్కడి వక్తలు ఎస్పీ మీద ప్రశంసలు కురిపించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నియంత్రణ, రహదారి భద్రతలపై రాజమండ్రిలో తరచూ అవగాహనా సదస్సులు నిర్వహించడం, ఇటువంటి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలివ్వడం ఎస్పీ రాజకుమారి డ్యూటీలో ఒక భాగంగా భావిస్తారు.
పోలీసులంటే భయపడే రోజులు పోయి.. పోలీసుల్లో ఆత్మబంధువుల్ని చూసుకునే రోజులు వచ్చాయంటే.. దానికి ఇటువంటి కొందరు ’గట్టి’ పోలీసులే కారణం. రాజమండ్రి ఉన్నంత వరకూ రాజకుమారి గుర్తుంటుంది అంటూ ఆ ఊరు ఊరంతా ఒకేమాట చెప్పుకుంటోందంటే.. దానికి రాజకుమారి వ్యక్తిత్వం, రాజకుమారి మనసు, రాజకుమారి మాట, రాజకుమారి ఆశయం.. అన్నీ కారణాలే! అందుకే మేడమ్ రాజకుమారికి వెయ్యి సెల్యూట్లు కొట్టినా తక్కువే!

The post నాపేరు రాజకుమారి.. నా ఇల్లు రాజమండ్రి.. appeared first on Realhero.in.

]]>
http://www.realhero.in/%e0%b0%a8%e0%b0%be%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%87%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2/feed/ 0
Patan Jameel Khan International Karate Champion http://www.realhero.in/patan-jameel-khan-international-karate-champion/ http://www.realhero.in/patan-jameel-khan-international-karate-champion/#respond Fri, 26 Jan 2018 10:29:55 +0000 http://www.realhero.in/?p=671 The post Patan Jameel Khan International Karate Champion appeared first on Realhero.in.

]]>

The post Patan Jameel Khan International Karate Champion appeared first on Realhero.in.

]]>
http://www.realhero.in/patan-jameel-khan-international-karate-champion/feed/ 0
Rahul Dev Sharma IPS Working http://www.realhero.in/rahul-dev-sharma-ips-working/ http://www.realhero.in/rahul-dev-sharma-ips-working/#respond Fri, 26 Jan 2018 10:00:05 +0000 http://www.realhero.in/?p=632 The post Rahul Dev Sharma IPS Working appeared first on Realhero.in.

]]>

The post Rahul Dev Sharma IPS Working appeared first on Realhero.in.

]]>
http://www.realhero.in/rahul-dev-sharma-ips-working/feed/ 0
AP DGP Malakondaiah http://www.realhero.in/ap-dgp-malakondaiah/ http://www.realhero.in/ap-dgp-malakondaiah/#respond Fri, 26 Jan 2018 07:52:25 +0000 http://www.realhero.in/?p=629 The post AP DGP Malakondaiah appeared first on Realhero.in.

]]>

The post AP DGP Malakondaiah appeared first on Realhero.in.

]]>
http://www.realhero.in/ap-dgp-malakondaiah/feed/ 0
Rahul Dev Sharma IPS http://www.realhero.in/rahul-dev-sharma-ips/ http://www.realhero.in/rahul-dev-sharma-ips/#respond Fri, 26 Jan 2018 07:40:13 +0000 http://www.realhero.in/?p=618 The post Rahul Dev Sharma IPS appeared first on Realhero.in.

]]>

The post Rahul Dev Sharma IPS appeared first on Realhero.in.

]]>
http://www.realhero.in/rahul-dev-sharma-ips/feed/ 0